రెండు రోజుల్లో భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంపై కూడా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వివరించింది. ఆగ్నేయ బంగాళాఖతం, దాని పరిసరాలలో సగటు సముద్ర మట్టం నుం

Update: 2023-07-02 03:38 GMT

భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఏపీకి వర్ష సూచన జారీ చేసింది. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. అదే సమయంలో మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దేశంలోని ఇతర భాగాలకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తున్నాయని, అదే సమయంలో వాయవ్య ఉత్తరప్రదేశ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ వెల్లడించింది.

ఆగ్నేయ బంగాళాఖాతంపై కూడా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వివరించింది. ఆగ్నేయ బంగాళాఖతం, దాని పరిసరాలలో సగటు సముద్ర మట్టం నుండి 4.5 కిలో మీటర్ల నుండి 5.8 కిలో మీటర్ల ఎత్తు మధ్య ఏర్పడిన ఆవర్తనం అదే ప్రదేశంలో స్థిరంగా కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈరోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని తెలిపారు. ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. జులై 4, 5, 6 తేదీలలో తెలంగాణ రాష్ట్రం అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. 4,5 తేదీలలో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉంది. జులై 5వ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షాలు రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.


Tags:    

Similar News