బీఆర్ఎస్ అభ్య‌ర్ధుల జాబితా.. మహిళలకు కవిత క్షమాపణ చెప్పాలి : రాణీ రుద్రమ

బీఆర్ఎస్‌ నుంచి పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ చూసాక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

Update: 2023-08-21 11:50 GMT

బీఆర్ఎస్‌ నుంచి పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ చూసాక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీ రుద్రమ డిమాండ్ చేశారు. కేవలం లిక్కర్ స్కాం నుంచి దేశ ప్రజలను పక్క దారి పట్టించేందుకే.. కవిత మహిళా రిజర్వేషన్ డ్రామా అనేది ఈ లిస్ట్ తో రుజువైందన్నారు. 119 స్థానాల్లో ఏడుగురు మహిళలకు టికెట్ లు ఇచ్చిన మీకు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మాట్లాడే అర్హత లేదన్నారు. జనాభా లో 50% ఉన్న మహిళలకు బీఆర్ఎస్‌ పార్టీ 3% టికెట్ లు ఇస్తూ.. దేశ వ్యాప్తంగా పార్టీ కమిటీలల్లో మహిళలకు 30% రిజర్వేషన్ ఇస్తున్న బీజేపీ మీద వీళ్ళు పోరాటం చేస్తాననడం సిగ్గుచేటన్నారు. మహిళా రిజర్వేషన్ కోసం ఢిల్లీ రోడ్ల‌ మీద ధర్నాలు చేసిన కవిత.. ప్రగతి భవన్ ముంగట ఎందుకు ధర్నా లు చేయలేదని ప్ర‌శ్నించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును మొదట పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది ఎన్డీయే ప్రభుత్వమే. వరుసగా 4 సార్లు ప్రవేశ్ పెట్టింది బీజేపీనే. త్వరలో బిల్లు తీసుకువచ్చేది బీజేపీ ప్రభుత్వమేన‌ని అన్నారు. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు పత్రాలు చింపి పారేసిన పార్టీ లతో అంట కాగుతూ.. సొంత పార్టీ లో ఏ ఒక్క కమిటీలో మహిళల కు స్థానం ఇవ్వని బీఆర్ఎస్‌ పార్టీ కథ.. ఎమ్మెల్సీ కవిత దొంగ దీక్ష తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారని అన్నారు. ఉరికి ఉరికి కవిత ధర్నాలలో కూర్చున్న నాయకులంతా.. పట్టుమని పది మంది మహిళలకు మీ సొంత పార్టీ టికెట్ లు ఇయ్యకుంటే ఎందుకు మాట్లాడుతలేరని ప్ర‌శ్నించారు.


Tags:    

Similar News