SlBC Accident : టన్నెల్ లో మృతదేహాల జాడ తెలియక.. తవ్వకాలు జరపలేక?

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు నిరంతరం జరుగుతున్నాయి;

Update: 2025-03-22 03:49 GMT
accident, rescue operations,  left canal tunnel,  srisailam
  • whatsapp icon

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు నిరంతరం జరుగుతున్నాయి. ఏడుగురు మృతదేహాల ఆచూకీ కోసం గాలింపు చర్యలు సహాయక బృందాలు చేపడుతున్నాయి. నేటికి సహాయక చర్యలు 29వ రోజుకు చేరుకున్నామృతదేహాల జాడ తెలియరాలేదు. మృతదేహాలు ఉన్నాయని శునకాలు గుర్తించిన డీ1, డీ2 ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. మినీ జేసీబీలతో తవ్వకాలు జరుపుతున్నా ఆశించిన మేరకు ముందడగు పడటం లేదు. దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది అడుగుల మేరకు బురద పేరుకుపోవడంతో తవ్వకాలు జరపడం కూడా సాధ్యం కావడం లేదని సహాయక బృందాలు చెబుతున్నాయి.

ప్రమాదకరమైన ప్రదేశంలో...
మృతదేహాలు ఉంటాయని కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్ గుర్తించినా అక్కడ ప్రమాదకరమైన పరిస్థితులు ఉండటంతో అక్కడకు కార్మికులు వెళ్లి తవ్వకాలు జరిపేందుకు భయపడిపోతున్నారు. ఇంకా నీరు ఉబికి వస్తుండటంతో పాటు టీబీఎం మిషన్ శిధాలాలు చుట్టూ ఉండటంతో వాటి తొలగింపు కూడా అసాధ్యంగా మారింది. చివరి ప్రాంతం అత్యంత ప్రమాదకరమైనదని, అక్కడకు వెళితే మళ్లీ అనుకోని ఘటన జరిగితే అందుకు బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా ఇందుకు అంగీకరించడం లేదు. ప్రభుత్వం నుంచి కూడా కార్మికుల చేత తవ్వకాలు జరిపేందుకు అనుమతి లభించకపోవడంతో యంత్రాల చేతనే పనిని కానిచ్చేస్తున్నారు.
రోజుకు కోట్లు ఖర్చవుతున్నా...
ప్రమాదం జరిగి ఇన్ని రోజులవుతున్నా ఆపరేషన్ ముగియలేదు. రోజుకు రోబోల కోసం నాలుగు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఇక జేసీబీలు, సహాయక బృందాల కోసం లక్షల్లో రోజు వారీ ఖర్చవుతుంది. అయినా సరే ఎలాగైనా కార్మికుల మృతదేహాలను బంధువులకు అప్పగించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఖర్చుకు వెనకాడకుండా సహాయక చర్యలను కొనసాగిస్తుంది. ఉన్నతాధికారులు అక్కడే ఉండి పనులు పర్యవేక్షిస్తున్నప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు. ప్రమాదం కావాలని చేసింది కాదు. ఒకరి ప్రమేయం లేకుండానే జరిగిపోయిన ఘటనలో ఎనిమిది మంది బలయ్యారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా తగిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అదే సమయంలో ప్రభుత్వానికి ఈ విషయంలో అందరూ అండగా నిలవాల్సిన అవరమూ ఉంది.


Tags:    

Similar News