వారిద్దరిది 'ఫెవికాల్' బంధం : రేవంత్

స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయ‌న విగ్ర‌హానికి

Update: 2023-08-20 06:40 GMT

స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయ‌న విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ దే అని అన్నారు. గ్రామ పంచాయితీలను బలోపేతం చేసింది.. మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది.. సాంకేతిక విప్లవం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ అని తెలిపారు.

ఆనాడు రాజీవ్ గాంధీ చేసిన కృషితోనే ఐటీ ఇంత అభివృద్ధి చెందిందన్నారు. టెలికాం రంగంలో మార్పులు తెచ్చి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. పిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. పేదల కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబమ‌ని కొనియాడారు.

దేశంలో విభజించు పాలించు విధానాన్ని బీజేపీ అవలంబిస్తోందని ఆరోపించారు. మణిపూర్ మండుతున్నా.. ప్రధాని అక్కడి భరోసా ఇవ్వలేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌ నాణానికి బొమ్మా, బొరుసులాంటివన్నారు. వారిద్దరిది ఫెవికాల్ బంధం అని కామెంట్ చేశారు. దేశ సంపదను మోదీ తన మిత్రులకు దోచి పెడుతుంటే.. కేసీఆర్ రాష్ట్ర సంపదను తన కుటుంబ సభ్యులకు దోచి పెడుతున్నారని ఆరోపించారు. ఈ రెండు పార్టీలకు బుద్ది చెప్పి.. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.


Tags:    

Similar News