ఇద్దరితో మొదలై.. ఇరవై మందికి

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్డి చే విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Update: 2023-03-23 12:08 GMT

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును సీబీఐ చేత గాని, సిట్టింగ్ జడ్డి చేతగాని విచారణ జరిపించాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. టీఎస్‌పీఎస్సీ అక్రమాల, అవినీతి పుట్ట అని ఆయన అన్నారు. సిట్ ఎదుట విచారణకు హాజరైన రేవంత్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. టీఎస్‌పీఎస్సీ నుంచి మొత్తం అరడజను ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని సిట్ తో విచారణ జరిపితే ఏం లాభం అని రేవంత్ ప్రశ్నించారు.

సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి...
ఇద్దరితో మొదలయిన అరెస్టులు ప్రస్తుతానికి ఇరవై మందికి చేరిందని రేవంత్ అన్నారు. ప్రభుత్వ పెద్దల హస్తం లేనిదే పరీక్ష పత్రాలు లీకేజీ సాధ్యం కాదని ప్రజలకు అర్థమైపోయిందన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ – కేటీఆర్ అండ్ కో నియమించిన “సిట్” విచారణకు తనను పిలిచిందని, తప్పును ఎత్తి చూపడమే తన నేరంగా భావించి విచారణకు పిలించిందన్నారు. ఆరోపణల గురించి ప్రస్తావించ కూడదని, అన్యాయాన్ని నిలదీయకూడదనే సిట్ తనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచిందన్నారు. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణ కోసం తాను చివరి వరకూ పోరాడతానని తెలిపారు. ముప్ఫయి లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని ఆయన తెలిపారు.


Tags:    

Similar News