Telangana : పేదలకు గుడ్ న్యూస్ .. నేటి నుంచి ప్రతి పేదల లోగిలో సన్న బియ్యం

ఉగాది రోజు పేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది;

Update: 2025-03-30 07:28 GMT
revanth reddy, distribute,  fine rice, ugadi
  • whatsapp icon

నేడు ఉగాది. చేదుతో పాటు తీపి కూడా ఉగాది పచ్చడి లో ఉంటుంది. అందులో తీపిని ప్రజలకు అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈరోజు పేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. కుటుంబంలో ఎందరున్నా ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వనుంది. హుజూర్ నగర్ మట్టపల్లి ‌లో సీఎం రేవంత్ సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించనున్నారు. అర్హులైన రేషన్ కార్డుదారులకు ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన్నబియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే చేశారు. ఉగాది పండగ నాడు పేదల ఇళ్లలో నిజమైన పండగను నెలకొల్పాలన్న ఉద్దేశ్యంతో పేదలకు అందరికీ అంటే తెలుపు రంగ కార్డులున్న వారందరికీ సన్న బియ్యాన్ని నేటి నుంచి ప్రభుత్వం అందించనుంది.

తెలుపు రంగు కార్డులకు...
ఇప్పటి వరకూ తెలుపు రంగు రేషన్ కార్డులకు దొడ్డుబియ్యం మాత్రమే సరఫరా చేస్తున్నారు. వాటిని కొందరు ఇంట్లో వినియోగించడం లేదు. దోసెలు, ఇతర వ్యాపారులకు విక్రయిస్తున్నారు. పెద్దమొత్తంలో రేషన్ బియ్యం దుర్వినియోగం అవుతుంది. రేషన్ బియ్యాన్ని ఎక్కువగా ఏపీకి తరలిస్తూ అక్కడి వ్యాపారులకు విక్రయించే వారి సంఖ్య పెరిగింది. దీంతో పేదలు తమ ఇంట్లోనే బియ్యాన్ని వాడుకోవాలంటే సన్న బియ్యం ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. దీనివల్ల తెలంగాణలో పండే ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసే అవకాశముంటుంది. అదే సమయంలో పేదల ఇళ్లలో ప్రతిరోజూ సన్నబియ్యంతో అన్నం వండుకునే పరిస్థితిని కిల్పించింది.
ప్రతి నియోజకవర్గంలో...
నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించడంతో ఇప్పటికే ఈ నెలకు సరిపడా అవసరమైన సన్నబియ్యాన్ని పౌరసరఫరాల అధికారులు సేకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలో ఈపథకాన్ని ప్రారంభించనున్నారు. అందుకోసం ప్రతి నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల మినీ సభలను ఏర్పాటు చేశారు. పేదలకు అండగా నిలిచే ప్రభుత్వం ఇది అని తెలియజెప్పడానికి పెద్దయెత్తున సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ఇరవై నాలుగు లక్షల టన్నుల సన్నబియ్యాన్ని రైతుల నుంచి సేకరించారు.


Tags:    

Similar News