అప్లికేషన్స్ విడుదల.. దరఖాస్తులు చేసుకోవ‌డ‌మే త‌రువాయి..!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే కాంగ్రెస్ అభ్యర్థుల కోసం

Update: 2023-08-18 10:55 GMT

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే కాంగ్రెస్ అభ్యర్థుల కోసం శుక్ర‌వారం అప్లికేషన్స్ విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.25వేలు, సాధారణ అభ్యర్థులకు రూ.50వేలుగా దరఖాస్తు రుసుము నిర్ణయించామ‌ని తెలిపారు. దరఖాస్తు రుసుము తిరిగి చెల్లించబడదని స్ప‌ష్టం చేశారు. ఈరోజు నుంచి దరఖాస్తుల కార్యక్రమం మొదలైందని.. ఈ నెల 25 దరఖాస్తులకు చివ‌రి రోజ‌ని వివ‌రించారు.

ఎలక్షన్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీ వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తుందని.. పార్టీకి వారు చేసిన సేవలు, సర్వేలు, గెలుపు ప్రాతిపదికన అభ్యర్థుల నివేదిక తయారు చేస్తారని వెల్ల‌డించారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్దారించాకే అభ్యర్థులను ఫైనల్ చేస్తారని.. అప్పటివరకు తామే అభ్యర్థులమంటూ ఎవరైనా చర్చించుకున్నా.. అవి ఊహాగానాలే అవుతాయని అన్నారు. అభ్యర్థులు ఫైనల్ అయినట్లు మీడియాలో వచ్చే కథనాలు నమ్మొద్దన్నారు. గతంలో హామీ ఇచ్చారని జరిగే ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టండని.. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే పార్టీ నేతలెవరైనా దరఖాస్తు చేసుకోవాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు.


Tags:    

Similar News