Medaram : నేడు వనంలోకి దేవతలు

మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర నేటితో ముగియనుంది. దీంతో భక్తులు అధిక సంఖ్యలో మేడారానికి చేరుకుంటున్నారు

Update: 2024-02-24 02:19 GMT

మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర నేటితో ముగియనుంది. ఈ లనె 21వ తేదీ నుంచి ప్రారంభమైన మేడారం జాతర నేటితో పరిసమాప్తమవుతుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జాతరకు కోటి మందికి పైగానే భక్తులు వచ్చి ఉంటారని అంచనా. ఆర్టీసీ ఆరువేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. వనదేవతలు తిరిగి వనప్రవేశం చేయడంతో ఈ జాతర ముగియనుంది.

ఈరోజు సాయంత్రం...
నేటి సాయంత్రం పూజారులు గద్దెల వద్ద పూజలు నిర్వహించన అనంతరం వన దేవతలను తిరిగి అడవికి తరలిస్తారు. సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లి ఆలయానికి, పగిడిరాజును మహబూబ్‌బాద్ జల్లా పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరునాగారం మండలం కొండాయ్ గ్రామానికి తరలిస్తారు. దీంతో జాతరను ముగించినట్లవుతుంది. చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో మేడారం జాతరకు చేరుకుంటున్నారు.


Tags:    

Similar News