చెట్టును కాపాడే విషయమై తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ చీఫ్ కోఆర్డినేటర్ అధికారిని సంప్రదించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)లోని చెట్ల పెంపకం విభాగంతోనూ మాట్లాడారు. నిపుణుల సూచనలతో యువకుల బృందం మర్రి చెట్టు కోసం రెస్క్యూ ప్లాన్‌ను సిద్ధం చేశారు.చెట్టు వేర్ల భాగం మట్టితో పాటు చెక్కుచెదరకుండా ఉంది, చెట్టుకు ఉన్న కొమ్మలు కత్తిరించారు. వెంటనే గోనె సంచులు, తాటాకులతో వేర్లను కప్పి నీళ్లు పోయడం మొదలుపెట్టాంరు. స్టేషన్‌ఘన్‌పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలోని నర్సరీ నుంచి నీటి కోసం 100 మీటర్ల నీటి పైపును ఉపయోగించారు. చెట్టును చూసుకుంటూ ఉండడానికి కొంతమంది స్థానికులకు కూడా బాధ్యతలను అప్పజెప్పారు.
దాదాపు రెండు వారాల తర్వాత, చెట్టుకు ఆకులు రావడం ప్రారంభించింది. చెట్టును బతికించడంలో మేము విజయం సాధించగలమనే విశ్వాసాన్ని మాకు ఇచ్చింది. ఆ చెట్టును అనిల్ యాదాద్రి భోంగీర్ జిల్లాలోని అతడి స్వంత గ్రామం మోటంకొండూర్‌కు మార్చాలని నిర్ణయించుకున్నాడు. సుమారు 54 కిలోమీటర్ల దూరంలో అతడికి ఉన్న ఒక ఎకరం భూమిలో ఆ చెట్టును ఉంచాలని నిర్ణయించుకున్నాడు. వారికి HMDA అధికారులు కూడా సహాయం చేసారు. ఒక కాంట్రాక్టర్‌ను పంపితే ఆ చెట్టును చూసి సుమారు 100 సంవత్సరాల వయస్సు ఉందని చెప్పాడు. జూన్ మూడో వారంలో చెట్టును మోటంకొండూరుకు తరలించేందుకు ప్రయత్నించారు. అనిల్, అతని స్నేహితులు మర్రి చెట్టును ఎత్తడానికి 412 టన్నుల సామర్థ్యం గల నాలుగు క్రేన్‌లను ఉపయోగించి.. పెద్ద ట్రక్కులోకి వేశారు. 24 గంటల్లో గ్రామంలోని అనిల్ సొంత పొలంలోకి చెట్టును జాగ్రత్తగా తీసుకువెళ్ళారు.
అనిల్ తన భూమిలో మర్రిచెట్టు నాటడానికి ఎనిమిది అడుగుల లోతు గుంతను తవ్వించాడు. ఆ తర్వాత గోమూత్రం, మట్టితో నింపారు. చెట్టును విజయవంతంగా తరలించడానికి సహాయం అందించిన గ్రామస్తులకు అనిల్, అతడి స్నేహితులు ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు అతడికి 90,000 రూపాయలు ఖర్చు అయినప్పటికీ.. చెట్టును కాపాడడం అంతకంటే విలువైనదని చెప్పాడు. మర్రి చెట్టుకు ఇప్పుడు కొత్తగా.. కొమ్మలు, ఆకులు మొలకెత్తుతూ ఉన్నాయి. ఆ మరెన్నో సంవత్సరాలు మనుగడ సాగిస్తుందని ఖచ్చితంగా భావిస్తున్నానని అనిల్ కాన్ఫిడెంట్ తో చెప్పాడు. అనిల్, అతడి స్నేహితులను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మొదలుపెట్టిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అభినందించారు.