ఎస్సీ, ఎస్టీలే లక్ష్యంగా ఎన్నికల హామీల హోరు 10వ తరగతి పాస్ అయితే రూ.10 వేలు

తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతుండగా, వివిధ పార్టీల హామీల హోరు పెరుగుతోంది. మరీ ముఖ్యంగా అన్నిపార్టీలు ఎస్సీ, ఎస్టీలపై ప్రేమను ఒలకపోస్తున్నారు.

Update: 2023-08-26 17:51 GMT

ఎస్సీ, ఎస్టీలే లక్ష్యంగా ఎన్నికల హామీల హోరు

10వ తరగతి పాస్ అయితే రూ.10 వేలు

తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతుండగా, వివిధ పార్టీల హామీల హోరు పెరుగుతోంది. మరీ ముఖ్యంగా అన్నిపార్టీలు ఎస్సీ, ఎస్టీలపై ప్రేమను ఒలకపోస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, పదోతరగతి పాసైన దళిత, గిరిజన విద్యార్థులకు రూ. 10 వేలు, ఇంటర్ పాసైతే రూ. 15 వేలు, డిగ్రీ పాసైతే రూ. 25 వేలు, పీజీ పూర్తయిన వారికి రూ 1లక్ష, ఎంఫిల్, పీహెచ్ డీ పూర్తి చేస్తే రూ.5 లక్షలు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రతిమండలంలో గురుకులం ఏర్పాటుతోపాటు, గ్రాడ్యుయేషన్ పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు వసతి కల్పిస్తామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వలేదని, స్వేచ్ఛతోకూడిన తెలంగాణ కాంగ్రెస్ అభిమతమన్నారు.

భట్టి విక్రమార్క

దళితులు, గిరిజనులు సంపదను పెంచుకునేందుకు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ తెచ్చామని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. పాదయాత్ర చేసే సమయంలో సమస్యలను తెలుసుకొని దీనిని రూపొందించామన్నారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం ప్రయత్నించాలని ఆయన కోరారు.

మల్లిఖార్జున ఖర్కే

ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో భాగంగా, ఎస్సీ, ఎస్టీల కుటుంబాలకు రూ.12 లక్షల సాయం, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాంట్రాక్టుల్లోప ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇళ్లులేనివారికి ఇంటి స్థలం, నిర్మాణానికి రూ.6 లక్షల సాయం, లబ్ధిదారులకు అసైన్డ్ భూములు అప్పగింత, అర్హులకు పోడు పట్టాల పంపిణీ చేస్తామని కాంగ్రెస్ అధినాయకుడు మల్లిఖార్జున ఖర్గే వెల్లడించారు.

సీతక్క

రాష్ట్రంలో రైతు బంధు పేరుతో అసలైన రైతులకు అన్యాయం జరుగుతోందని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్వే సీతక్క అన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ ఆ విషయం నుంచి ప్రజలను మళ్లించడానికి దళితులకు మూడెకరాల భూమని మభ్య పెట్టారన్నారు. కానీ ఏ ఒక్కరికీ 3 ఎకరాల భూమిని ఇవ్వలేదని కాంగ్రెస్ తోనే హక్కులను కాపాడుకుంటామని ఆమె చెప్పారు.

Tags:    

Similar News