బండి సంజయ్‌కు "సిట్" నోటీసులు

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బీజేపీ నేత బండి సంజయ్‌కు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం నోటీసులు జారీ చేసింది

Update: 2023-03-21 12:54 GMT

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం నోటీసులు జారీ చేసింది. ప్రశ్నాపత్రాల లీకేజీలో తమ వద్ద ఉన్న ఆధారాలను సిట్ అధికారుల ఎదుట సమర్పించాలని నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని బండి సంజయ్ కు నోటీసుల్లో పేర్కొన్నారు.

ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో...
బండి సంజయ్ టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అనేక అంశాలను ప్రస్తావించారు. పెద్ద తలకాయల ప్రమేయం ఇందులో ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతల హస్తం ఉందని కూడా ఆయన ఆరోపించారు. మంత్రి కేటీఆర్ పేషీ ప్రమేయంపై కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఆయనను ఈ నెల 23న హాజరు కావాలని కోరింది.


Tags:    

Similar News