నిలిచిన 25 సినిమా షూటింగ్ లు
టాలీవుడ్ లో కార్మికులు సమ్మె కొనసాగుతుంది. వేతనాలను పెంచితేనే షూటింగ్ లకు హాజరవుతామని కార్మికులు చెబుతున్నారు.
టాలీవుడ్ లో కార్మికులు సమ్మె కొనసాగుతుంది. వేతనాలను పెంచితేనే షూటింగ్ లకు హాజరవుతామని కార్మికులు చెబుతున్నారు. షూటింగ్ లకు హాజరై 15రోజుల తర్వాతనే తాము వేతనాల విషయాన్ని పరిశీలిస్తామని నిర్మాతల మండలి చెబుతుంది. దీంతో ప్రతిష్టంభన ఏర్పడింది. దాదాపు 25 సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి. అగ్ర హీరోల సినిమాలు కూడా నిలిచిపోవడంతో వారు జోక్యం చేసుకుంటారని చెబుతున్నారు.
తలసాని జోక్యంతో....
అయితే ఈరోజు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఇరు వర్గాల నేతలతో సమావేశమయ్యారు. ఇద్దరూ పట్టుదలకు పోవద్దని తలసాని సూచించారు. కార్మికులు 45 శాతం వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అంత సాధ్యం కాదని నిర్మాతల మండలి చెబుతుంది. అయితే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచనతో మధ్యాహ్నం యూనియన్ నేతలు, నిర్మాతల మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం వెలువడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.