Telangana : ఎర్రటి ఎండలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ.. ఉడికిపోతున్న తెలంగాణ
తెలంగాణలో ఎండలు మండి పోతున్నాయి. భానుడి భగభగలతో తెలంగాణ ఉడికపోతుంది.
తెలంగాణలో ఎండలు మండి పోతున్నాయి. భానుడి భగభగలతో తెలంగాణ ఉడికపోతుంది. ఎండలు దంచికొడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత మార్క్ ను దాటాయి. ఉదయం నుంచే ఉక్కపోత మొదలవుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే ఐదు రోజుల పాటు మరింత తీవ్రంగా ఉష్ణోగ్రతలుంటాయిని వాతావరణ శాఖ తెలిపింది.
పదిహేను జిల్లాలకు...
నేటి నుంచి పదిహేను జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఐఎండీ జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు అధికంగా వడగాడ్పుల ముప్పు ఉందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.