మండుతున్న ఎండలు.. విద్యాశాఖ కీలక నిర్ణయం
తెలంగాణ లో ఎండలు మండి పోతున్నాయి. మార్చి నెలలోనే 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి
తెలంగాణ లో ఎండలు మండి పోతున్నాయి. మార్చి నెలలోనే 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు పగలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. మరో రెండు రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసింది కూడా. ఎండలతో పాటు వడగాలులు కూడా వీస్తుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
పాఠశాలల వేళల కుదింపు....
దీంతో తెలంగాణలో పాఠశాలల వేళలలు మరింత కుదించారు. ఉదయం 11.30 గంటల వరకే పాఠశాలలను నిర్వహించాలని ఆదేశించారు. ఏప్రిల్ 6వ తేదీ వరకూ ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని చెప్పారు. ప్రధానంగా కుమురం భీం జిల్లా కెరిమెరిలో 43.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింి. భూపాలపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్, యాదాద్రి జిల్లాల్లో 43 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవువుతన్నాయి.