Telangana : వామ్మో.. ఇవేమి ఎండలు.. దంచికొడుతున్నాయి.. ఇప్పుడే ఇలా ఉంటే?
ఎండలు మండిపోతున్నాయి. మరో ఐదు రోజులు తెలంగాణలో ఇదే రకమైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది
ఎండలు మండిపోతున్నాయి. మరో ఐదు రోజులు తెలంగాణలో ఇదే రకమైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తెలంగాణలో అనేక జిల్లాల్లో నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడి పోతున్నారు. మార్చి నెల ముగియక ముందే నలభై డిగ్రీలు దాడటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు.
అత్యధికంగా...
నిన్న అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 43.1 డిగ్రీలు, పదమూడు జిల్లాల్లో 42 డిగ్రీలు పన్నెండు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అంటే మార్చి నెలలోనే నలభై డిగ్రీల టెంపరేచర్ దాటితే మే నెల ఎలా ఉంటుందో ఊహించలేని పరిస్థితి. ఈరోజు తెలంగాణలోని ఇరవై ఒక్క జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ మొదటి వారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందన్న హెచ్చరికలతో ప్రజలు భయపడిపోతున్నారు.