రెండురోజులు వరంగల్ లో జస్టిస్ ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేడు వరంగల్ లో పర్యటించనున్నారు. రెండు రోజల పాటు ఆయన పర్యటిస్తారు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేడు వరంగల్ లో పర్యటించనున్నారు. రెండు రోజల పాటు ఆయన పర్యటిస్తారు. రామప్ప దేవాలయాన్ని ఈ సందర్బంగా ఎన్వీ రమణ తన సతీమణితో కలసి దర్శిస్తారు. ఇటీవలే రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన సంగతి తెలిసిందే. అనంతరం రామప్ప ఆలయంలోని రుద్రేశ్వరస్వామిని జస్టిస్ ఎన్వీరమణ దంపతులు దర్శించుకుంటారు.
రేపు ఉదయం....
తర్వాత రాత్రికి హనుమకొండలో బస చేయనున్నారు. రేపు ఉదయం వరంగల్ లోని భద్రకాళీ ఆలయాన్ని ఎన్వీ రమణ దంపతులు దర్శించుకుంటారు. అక్కడ పదికోర్టుల భవన సముదాయాన్ని ఎన్వీరమణ ప్రారంభిస్తారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పర్యటనతో పోలీసులు అత్యంత భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.