కేసీఆర్ సర్కార్ పై సుప్రీం అసహనం
తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని అసహనం వ్యక్తం చేసింది
తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని అసహనం వ్యక్తం చేసింది. ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగులకు నియామకపు ఉత్తర్వులను ఇచ్చే విషయంలో తెలంగాణ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని పేర్కొంది. జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం నడుచుకోవాలని ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది
కోర్టు థిక్కారం కిందకు....
ఇది కోర్టు థిక్కారం కిందకు వస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. విద్యుత్ శాఖ అధికారులకు జైలు శిక్ష పరిష్కారమని కటువుగా వ్యాఖ్యానించింది. ఏపీ విద్యుత్తు సంస్థల నుంచి రిలీవ్ అయిన 84 మందిని వెంటనే విధుల్లో చేర్చుకోవాలని సుప్రీంకోర్టు మరోమారు ఆదేశించింది. రెండు వారాల్లో అమలు చేయకుంటే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇదే చివరి అవకాశంగా భావించాలని పేర్కొంటూ ఈ పిటీషన్ పై విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.