Kalvakuntla Kavitha : నేడు కవిత పిటీషన్ పై సుప్రీంలో విచారణ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేయడం అక్రమమంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇటీవల కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసి ప్రస్తుతం ఆమె ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆమెను ఈడీ అధికారులు ఐదు రోజుల నుంచి విచారణ జరుపుతున్నారు.
రేపు కోర్టు ఎదుటకు...
ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం రేపటితో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీ ముగియనుంది. ఈ నెల 23వ తేదీన ఆమెను తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వులున్నాయి. ఈ నేపథ్యంలో నేడు కవిత పిటీషన్ పై సుప్రీంకోర్టులో జరగనున్న విచారణలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ బీఆర్ఎస్ నేతల్లో నెలకొంది.