తాలిపేరు ప్రాజెక్టు వద్ద పెరుగుతున్న వరద

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరుగుతోంది.

Update: 2024-07-20 07:09 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువన ఉన్న చత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శుక్రవారం 24 గేట్లు ఎత్తి 59 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువన గోదావరికి విడుదల చేస్తున్నారు.

భారీ వర్షాలతో...
తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువ నుంచి 60,297 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టులో క్రమేపీ వరద ఉద్ధృతి పెరుగుతున్నట్లు ప్రాజెక్టు అసిస్టెంట్ ఇంజినీర్ ఉపేందర్ తెలిపారు. మరో పక్క చింతవాగు, పగిడి వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలుకు వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.


Tags:    

Similar News