కేంద్రానికి గవర్నర్ కంప్లయింట్
కేంద్ర ప్రభుత్వానికి తమిళి సై సౌందర రాజన్ ఫిర్యాదు చేశారు. రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహణపై కేంద్రానికి రిపోర్టు పంపారు
కేంద్ర ప్రభుత్వానికి తమిళి సై సౌందర రాజన్ ఫిర్యాదు చేశారు. రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహణపై గవర్నర్ కేంద్రానికి రిపోర్టు పంపారు. కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటించలేదని ఆమె తమ నివేదికలో పేర్కొన్నారు. గవర్నర్ వ్యవస్థను కించపర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
రిపబ్లిక్ డే వేడుకలను....
అంతేకాకుండా రిపబ్లిక్ డే వేడుకలను రాజ్‌భవన్ లో నిర్వహించాలని ప్రభుత్వం చెప్పిందన్నారు. వేడుకలకు సీఎస్, డీజీపీలను మాత్రమే పంపారని, ముఖ్యమంత్రి హాజరు కాలేదని పేర్కొన్నారు. గవర్నర్ ను అవమానించేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని తమిళి సై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు.