త్వరలోనే కొత్తపార్టీ పెడుతున్నా : తీన్మార్ మల్లన్న

తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతి రాజ్యమేలుతోందని తీన్మార్ మల్లన్న ఎద్దేవా చేశారు. తమకు ఎన్ని అడ్డంకులు వచ్చినా..

Update: 2022-05-02 09:29 GMT

హైదరాబాద్ : త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రాన్ని 7200 మంది దొంగలు పట్టి పీడిస్తున్నారని విమర్శించిన ఆయన.. 7200 మందితో కూడిన ముఠా రాష్ట్ర సంపదను కొల్లగొడుతోందని ఆరోపించారు. అందుకే 7200 పేరుతో తాను ఉద్యమాన్ని మొదలుపెట్టినట్లు మల్లన్న వివరించారు. ఈ టీమ్ బీజేపీ కంటే లక్షరెట్లు వేగంగా పనిచేస్తుందని, ఇకపై తాను బీజేపీ కార్యాలయంలో అడుగుపెట్టబోనని మల్లన్న స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతి రాజ్యమేలుతోందని తీన్మార్ మల్లన్న ఎద్దేవా చేశారు. తమకు ఎన్ని అడ్డంకులు వచ్చినా.. టీమ్ 7200 భయపడదని తెలిపారు. 10 రోజుల్లో తాను ప్రజల మధ్యకు వెళ్లనున్నట్లు చెప్పిన మల్లన్న.. తనపై, తన కుటుంబంపై ఉన్న ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి రాసిచ్చి, రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. ఆస్తులను త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చిన నేతలు ఇంతవరకూ ఎవరూ లేరని తెలిపారు. ఏడాదిన్నర తర్వాత హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 10 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు.


Tags:    

Similar News