Telangana: కేబినెట్ బెర్త్ దక్కించుకున్న 11 మంది ఎమ్మెల్యేలు

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి

Update: 2023-12-07 04:43 GMT

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం, మంత్రులను గవర్నర్‌ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే ఇప్పటికే కేసీ వేణుగోపాల్‌ మంత్రులుగా కాబోతున్న పలువురు ఎమ్మెల్యేలకు ఫోన్‌ చేశారు. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో సీఎంతో పాటు మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

కేబినెట్ బెర్త్ దక్కించుకున్న వారు:

1. భట్టి విక్రమార్క – డిప్యూటీ సీఎం

2. ఉత్తమ్ కుమార్ రెడ్డి

3. పొన్నం ప్రభాకర్

4. కోమటిరెడ్డి వెంకటరెడ్డి

5. దామోదర రాజనర్సింహ

6. దుద్దిళ్ల శ్రీధర్ బాబు

7. పొంగులేటి శ్రీనివాసరెడ్డి

8. కొండా సురేఖ

9. సీతక్క

10 తుమ్మల నాగేశ్వరరావు

11. జూపల్లి కృష్టారావు



Tags:    

Similar News