Telangana : తెలంగాణ కేబినెట్ 23 కాదు.. 26వ తేదీన

తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 26వ తేదీన మంత్రివర్గ సమావేశం జరగనుంది

Update: 2024-10-20 04:01 GMT

తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 26వ తేదీన మంత్రివర్గ సమావేశం జరగనుంది. వాస్తవానికి ఈనెల 23వ తేదీన తెలంగాణ మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ సమావేశాన్ని 26వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ జరుగుతుందని చీఫ్ సెక్రటరీ శాంతికుమారి తెలిపారు.

కీలక నిర్ణయాలను...
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పించడంతో పాటు మూసీ నిర్వాసితుల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జరిగిన వరద నష్టం, రైతు భరోసా వంటి కీలక అంశాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది.


Tags:    

Similar News