Telangana : నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం.. కీలక నిర్ణయాలు
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. ధరణి పోర్టల్ పేరును ‘భూమాత’గా మార్చడానికి కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
హైడ్రా, ధరణి...
అలాగే ధరణిలో రైతుల హక్కులపై ఏర్పడే సమస్యల పరిష్కారానికి అప్పిలేట్ అథారిటీని ఏర్పాటుచేయడానికి ఈ చట్టంపై చర్చిస్తారని సమాచారం అందుతోంది. మూసీ పునరుజ్జీవ చర్యలు, హైడ్రా, 317 జీవో, ఉద్యోగుల డీఏలు, ధాన్యం కొనుగోళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ తదితర అంశాలపై చర్చిస్తారని అనధికారికంగా తెలిసింది. కొన్ని కీలక నిర్ణయాలు నేడు తీసుకునే అవకాశముంది.