డిసెంబర్ లో కేసీఆర్ టూర్ షెడ్యూల్
వచ్చే నెలలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనలు చేయాలని నిర్ణయించారు;
వచ్చే నెలలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనలు చేయాలని నిర్ణయించారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నారు. ఈ మేరకు డిసెంబరు నెలలో కేసీఆర్ టూర్ ప్రోగ్రాం రెడీ అయిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ప్రారంభోత్సవాలు...
డిసెంబరు 1వ తేదీన మహబూబాబాద్, 4వ తేదీన మహబూబ్ నగర్, 7న జగిత్యాల తర్వాత మంచిర్యాల, ఖమ్మం జిల్లాల్లో కేసీఆర్ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయాలతో పాటు పార్టీ కార్యాలయాలను కూడా కేసీఆర్ ప్రారంభించనున్నారు. పెద్దయెత్తున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో ప్రజలకు వద్దకు వెళ్లి వచ్చే ఎన్నికలకు కేసీఆర్ పార్టీని సమాయత్తం చేస్తున్నారు.