భద్రాచలంలో కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలంలో పర్యటిస్తున్నారు. భద్రాచలం వద్ద బ్రిడ్జిపై ఆయన గోదావరికి పూజలు నిర్వహించారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలంలో పర్యటిస్తున్నారు. భద్రాచలం వద్ద బ్రిడ్జిపై ఆయన గోదావరికి పూజలు నిర్వహించారు. గోదావరి ప్రవాహాన్ని బ్రిడ్జిపై నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. వరద తగ్గుముఖం పట్టడంతో కొంత ఊరట కల్గించిందని, 70 అడుగులు దాటిన గోదావరి వరద పరిస్థితిని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. భద్రాచలం పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి.
వరద బాధితులతో...
మరికాసేపట్లో కేసీఆర్ వరద బాధితులతో మాట్లాడే అవకాశముంది. భద్రాచలం పట్టణం నీట మునగకుండా కరకట్ట ఎత్తును మరింత పెంచాలని స్థానికులు ఈ సందర్భంగా కేసీఆర్ ను కోరనున్నారు. వర్షం కురుస్తుండటంతో ఏరియల్ సర్వే రద్దు చేసుకుని రోడ్డు మార్గాన ఆయన భద్రాచలం చేరుకున్నారు. వరద నీటిలోనే ఆయన కాన్వాయ్ వెళ్లడం గమనార్హం. వర్షంలోనే కేసీఆర్ కరకట్టను పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో కేసీఆర్ సమీక్ష చేయనున్నారు.