కొండగట్టులో కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆయన ఆలయాన్ని తొలుత ఏరియల్ సర్వే నిర్వహించారు

Update: 2023-02-15 06:15 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆయన ఆలయాన్ని తొలుత ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఇరవై ఐదేళ్ల తర్వాత కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆలయ పండితులు వేద మంత్రోచ్ఛరణాల మధ్య స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనం చేశారు.

ఆలయ అధికారులతో...
అనంతరం ఆయన అధికారులతో సమావేశమవుతారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధిపైన ఆయన అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం బడ్జెట్ లో వంద కోట్ల రూపాయలను కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆర్కిటెక్చర్ ఆనందసాయి రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను పరిశీలిస్తారు. అవసరమైన మార్పులు, చేర్పులను కేసీఆర్ సూచిస్తారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా కొండ మీదకు భక్తులు రాకుండా పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News