కామారెడ్డికి నేడు సీఎం కేసీఆర్

నేడు కామారెడ్డి జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు

Update: 2023-03-01 03:36 GMT

నేడు కామారెడ్డి జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. బీర్కూర్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి కామారెడ్డి జిల్లా వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సీఎం పర్యటన సందర్భంగా...
కేసీఆర్ పర్యటన సందర్భంగా పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా ఎలాంటి నిరసనలు జరపకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని వెంటనే తిరిగి బయలుదేరి వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News