14న కొండగట్టుకు కేసీఆర్
ఈ నెల 14వతేదీన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించనున్నారు.;
ఈ నెల 14వతేదీన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించనున్నారు. ఇటీవల కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం వంద కోట్ల రూపాయల నిధులను కేటాయించిన సంగతి తెలిసిందే. బడ్జెట్ లోనూ ఈ నిధులను కేటాయించారు. దీంతో ఆలయాన్ని సందర్శించి కేసీఆర్ అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించనున్నారు.
ఆలయ అభివృద్ధికి...
ఆలయంలో ఏం పనులు చేపట్టాలి? మాస్టర్ ప్లాన్ రూపలకల్పన వంటి వాటిపై అధికారులతో చర్చించనున్నారు. అక్కడ ఘాట్ రోడ్ ను మెరుగుపర్చడంతో పాటు వసతి సదుపాయాల కల్పనపై మరింత దృష్టి పెట్టనున్నారు. నిరంతరం ఆలయ ప్రాంగణంలో తాగునీటి సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. ఆలయాన్ని తొలుత సందర్శించి, అనంతరం అధికారులతో సమీక్ష చేసిన అనంతరం కేసీఆర్ పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.