నేడు నిజామాబాద్ జిల్లాకు కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కలెక్టరేట్ భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. కలెక్టర్ భవనంతో పాటు టీఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం నిజామాబాద్ లో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.
60 కోట్ల వ్యయంతో....
మధ్యాహ్నం 2.30 గంటలకు కేసీఆర్ నిజామాబాద్ కలెక్టరేట్ ను ప్రారంభిస్తారు. 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ కలెక్టరేట్ ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 60 కోట్ల రూపాయలు వెచ్చించారు. కలెక్టరేట్ లో 36 ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయనున్నాయి. దీంతో సీఎం పర్యటనకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. భారీగా జనసమీకరణ చేసే ఏర్పాట్లలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారు.