నేడు వికారాబాద్ జిల్లాకు కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. వికారాబాద్ లో 60.70 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన కలెక్టరేట్ సముదాయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం కేసీఆర్ అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. కేసీఆర్ జిల్లాల పర్యటన మళ్లీ ప్రారంభించారు. ఇటీవల వరదల కారణంగా కొంత జిల్లాల పర్యటనకు గ్యాప్ ఇచ్చారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తిరిగి జిల్లాల్లో పర్యటించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
బహిరంగ సభకు...
కేసీఆర్ వికారాబాద్ జిల్లా పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలుత వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టరేట్ సముదాయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. బహిరంగ సభకు పెద్దయెత్తున జనాలను సమీకరించేందుకు టీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. మరోవైపు కేసీఆర్ జిల్లా పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.