కేసీఆర్ పర్సనల్ డాక్టర్ ఏమన్నారంటే?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు పలు విషయాలను వెల్లడించారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు పలు విషయాలను వెల్లడించారు. కేసీఆర్ కు ఎడమ చెయ్యి లాగుతుందని చెప్పారన్నారు. ఆయన రెండు రోజులుగా బలహీనంగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్ కు ప్రస్తుతం అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ కొద్ది సేపటి క్రితమే యశోదా ఆసుపత్రికి చేరుకున్నారు. స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి వచ్చారు.
నిలకడగానే ఉందని....
కేసీఆర్ కు ఏంజియోగ్రామ్, సిటీస్కాన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థిితి బాగానే ఉందని ఆయన వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు తెలిపారు. కేసీఆర్ వెంట భార్య, కూతరు కవిత, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ లు ఉన్నారు. ఉప్పల్ పర్యటనలో ఉన్న కేటీఆర్ హుటాహుటిన యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. కేసీఆర్ ఆసుపత్రికి వచ్చారని తెలిసి పలువురు మంత్రులు యశోదాకు చేరుకున్నారు.