కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు ఆంజనేయస్వామి పర్యటన వాయిదా పడింది;

Update: 2023-02-14 01:59 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు ఆంజనేయస్వామి పర్యటన వాయిదా పడింది. మంగళవారం ఆయన జగిత్యాల జిల్లాలోని కొండగట్టును సందర్శించాల్సి ఉంది. అయితే ఆయన తన పర్యటనను బుధవారానికి వాయిదా వేసుకున్నారు. మంగళవారం కొండగట్టుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశమున్నందున వారిని ఇబ్బందులు పెట్టడం ఇష్టంలేని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు.

ఆలయ అభివృద్ధికి...
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని వంద కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు బడ్జెట్ లో నిధులను కూడా కేటాయించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు కేసీఆర్ కొండగట్టుకు వచ్చి అక్కడి ఆలయ అధికారులతో రేపు సమీక్షించనున్నారు.


Tags:    

Similar News