నేడు దళితబంధు రెండో విడత
తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ నేడు దళిత బంధు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ నేడు దళిత బంధు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వెల్‌ఫేర్ స్కీమ్‌లను వేగంగా అమలు పర్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో గాంధీ జయంతి రోజున దళిత బంధు రెండో విడత పథకాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు.
ఒక్కో కుటుంబానికి...
దళిత బంధు పథకం కింద ఒక్కో కుటుంబానికి పది లక్షల రూపాయలను కేసీఆర్ ప్రభుత్వం ఇస్తుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని 162 మంది లబ్దిదారులకు మంత్రి కేటీఆర్ చెక్కులను ఈరోజు పంపిణీ చేయనున్నారు. అయితే ఈ పథకం కింద అనేక మంది దరఖాస్తు చేసుకున్నా కొందరికే వర్తింప చేయడంపై విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో నియోజకవర్గానికి 1100 మంది లబ్దిదారులను ఎంపిక చేయనున్నారని అధికారులు తెలిపారు.