Revanth Reddy : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి.. వరికి బోనస్ ప్రకటించిన సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు

Update: 2024-10-03 12:29 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. సన్న వడ్ల కొనుగోలు చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన చోట కొత్త ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. సన్నవడ్ల కొనుగోలుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సన్నవడ్ల కు ఐదు వందల రూపాయల బోనస్ ను ఇవ్వాలని నిర్ణయించారు.

ప్రతిరోజూ రెండు గంటలు...
ఐకేపీ సెంటర్ల కి సీరియల్ నెంబర్లు ఇవ్వాలని, .సన్నవడ్ల పై ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని, గోనె సంచులను అందుబాటులో ఉంచాలని, ధాన్యం కొనుగోలు లో వ్యవసాయ అధికారులను భాగస్వామ్యులను చేయాలని కోరారు. కొనుగోలు చేసిన ధ్యానం వెంటనే తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. .ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడవకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజూ కలెక్టర్లు రెండు గంటలు ధాన్యం కొనుగోలు పైన సమీక్ష జరపాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల పైన కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలో కి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.


Tags:    

Similar News