Revanth Reddy : దుబ్బాక ప్రజలకు గుడ్ న్యూస్.. అక్కడే స్కిల్ యూనివర్సిటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు;

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. దుబ్బాకలో యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం అవసరమైన స్థలాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించారు. దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రిని కమర్యాదపూర్వకంగా కలసి వినతి పత్రాన్ని అందచేశారు.
స్థలాన్ని పరిశీలించాలని...
అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించి అందుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించాలని కోరారు. ఇందుకోసం దుబ్బాక వెళ్లి స్థల పరిశీలను చేయాలని అధికారులను కోరారు. దీంతో పాటు హబ్సీపూర్-లచ్చపేట్ రెండు వరసల రోడ్లకు 35 కోట్ల రూపాయలను రేవంత్ రెడ్డి మంజూరు చేశారు. హామ్ మోడల్ లో ఈ రోడ్డును అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. తన వినతికి స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.