Revanth Reddy : రేవంత్ రెడ్డి తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్.. ఇక రేషన్ కార్డులు అవసరం లేదు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇక రేషన్ కార్డు అవసరం లేకుండా ఫ్యామిలీ డిజిటల్ కార్డును తెస్తున్నామన్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇక రేషన్ కార్డు అవసరం లేకుండా ఫ్యామిలీ డిజిటల్ కార్డును అందుబాటులోకి తెస్తున్నామని ఆయన తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు కింద సికింద్రాబాద్ లో చేపట్టిన డిజిటిల్ ఫ్యామిలీ కార్డు ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆరోగ్య శ్రీ నిధులు అవసరమయినా, రేషన్ అవసరమైనా, కల్యాణ లక్ష్మి పథకం కింద నగదు జమ కావాల్సి ఉన్నా, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావాలన్నా ఇక రేషన్ కార్డు అవసరం లేదన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డును ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిది కాదా? అని ప్రశ్నించారు.
పది నెలలు దాటలేదు...
పది నెలలు కూడా తాము అధికారంలోకి రాకముందే అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. డిజిటల్ హెల్త్ కార్డులను కూడా కుటుంబ ఆరోగ్య వివరాలను అందులో పొందు పరుస్తామని తెలిపారు. అయితే మూసీ నది ప్రక్షాళన వంటి కార్యక్రమాలను చేపడుతున్నా ప్రజలను విపక్షాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఒక గుర్తింపు కార్డు వస్తుందని తెలిపారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళలే ఇంటి పెద్దలుగా ఉంటారని ఆయన ప్రకటించారు. కేటీఆర్ ఫాం హౌస్ లు కూల్చితే తప్పా అని ఆయన ప్రశ్నించారు. పేదలు బస్తీల్లో ఉండాలని, కానీ మీరు ఫాంహౌస్ లో వినోదాలు చేసుకుంటారా? అని ప్రశ్నించారు. మూసీ నది నిర్వాసితులందరికీ జవహర్ నగర్ లో వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమిలో స్థలాన్ని కేటాయించి అక్కడ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని తెలిపారు.