Congress : ఆరు గ్యారంటీల దరఖాస్తు పత్రం విడుదల,ప్రజా పాలన దరఖాస్తు పత్రం

ఆరు గ్యారంటీల దరఖాస్తు పత్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు.

Update: 2023-12-27 07:49 GMT

telangana schemes application form

ఆరు గ్యారంటీల దరఖాస్తు పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ దరఖాస్తు ద్వారా తమ అర్హతను ప్రజలు ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఢిల్లీ నుంచి నేరుగా సచివాలయానికి చేరుకున్న రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రజా పాలన కార్యక్రమంలో...
రేపటి నుంచి ప్రజా పాలన ప్రారంభం అవుతున్న సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ దరఖాస్తును ప్రజల ముందు ఉంచారు. జనవరి ఆరో తేదీ వరకూ గ్రామ సభలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి ఆరు గ్యారంటీలకు సంబంధించిన లబ్దిదారుల ఎంపిక జరుతుంది. అందుకోసమే ముందుగా ఈ దరఖాస్తును రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాపాలన పోస్టర్ ను కూడా ఆవిష్కరించారు.

6 గ్యారెంటీ ల ప్రజా పాలనా దరకాస్తు ఫారం ని డౌన్లోడ్ చేస్కోండి 



Tags:    

Similar News