Telangana : మూడో విడత రైతు రుణమాఫీ నిధుల విడుదల

మూడో విడత రుణమాఫీ నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు

Update: 2024-08-15 12:17 GMT

మూడో విడత రుణమాఫీ నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. వైరాలో జరిగిన బహిరంగ సభలో ఆయన రెండు లక్షల రూపాయల రుణమాఫీని నేటి నుంచి అమలవుతుందని తెలిపారు. రేపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే సిద్ధిపేట ఎమ్మెల్యే పదవికి హరీశ్ రావు రాజీనామా చేస్తానన్నారని, ఇప్పుడు రుణమాఫీని తమ ప్రభుత్వం అమలు చేసిందని, హరీశ్ రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, లేకుంటే రైతులకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.లేదంటే అమరవీరుల స్థూపం వద్ద ముక్కుకు నేలకు రాయాలన్నారు.

వరంగల్ డిక్లరేషన్ లో....
వరంగల్ డిక్లరేషన్ లో తెలంగాణ రైతులకు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని, చెప్పిన మాట మేరకు 31 వేల కోట్ల రూపాయలతో రుణమాఫీని చేశామని చెప్పారు. 2026 ఆగస్టు 15వ తేదీ లోప సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను కట్టించి పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తామని చెపపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు కట్టిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆరు గ్యారంటీల అమలు కోసం నిరంతరం కష్టపడుతూనే ఉన్నామని తెలిపారు. తెలంగాణలో ప్రతి పేదవాడు తలెత్తుకుని తిరిగేలా చేస్తామని చెప్పారు.


Tags:    

Similar News