Revanth Reddy : నేడు పాలమూరుకు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మహబూబ్ నగర్ కు రానున్నారు.;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మహబూబ్ నగర్ కు రానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న సందర్భంగా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ లో నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవసభకు రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సాయంత్రం మూడు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆయన సాయంత్రం 4.15 గంటలకు మహబూబ్ నగర్ కు చేరుకుంటారు.
బహిరంగ సభలో ప్రసంగం...
రైతులు, ప్రజలను ఉద్దేశించి రేవంత్ మాట్లాడతారు. లక్ష మంది రైతులను సమీకరించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు హాజరు కానున్నారు. రైతు పండగను గత మూడు రోజుల నుంచి మహబూబ్ నగర్ వేదికగా జరుపుకుంటున్నారు. రైతుల అవగాహన కోసం ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు.