Revanth Reddy : నేడు కోకా కోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ను ప్రారంభించననున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కోకాకోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ను ప్రారంభించనున్నారు

Update: 2024-12-02 02:00 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కోకాకోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ను ప్రారంభించనున్నారు. వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కోకాకోలా, థమ్స్ అప్ కూల్ డ్రింక్స్ తయారుు చేసే హిందూస్థాన్ బివరేజెస్ సంస్థ బండ తిమ్మాపూర్ ఫుడ్ పార్క్ లో నిర్మించిన భారీ బాట్లింగ్ యూనిట్ ను నేడు సీఎం ప్రారంభింస్తారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు మంత్రి శ్రీధర్ బాబుతో కలసి ఆయన ప్రారంభించనున్నారు. ఈ ప్లాంట్ నిర్మాణంతో కొత్తగా నాలుగు వందల మందికి ఉపాధి లభించనుంది. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఉస్మానియాపై సమీక్ష...

కొత్తగా నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. తెలంగాణలో కొత్తగా ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఆసుపత్రి రహదారులపై ముఖ్యమంత్రి అధికారులు అనేక సూచనలు చేశారు. వెంటనే సర్వే నిర్వహించాలని ఆదేశించారు. తాగునీరు, విద్యుత్తు, మురుగునీటి సదుపాయాల నిర్వహణ కోసం ప్రణాళికలను సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంలో అన్ని శాఖలను సమన్వయం చేసుకునేందుకు నోడల్ అధికారిగా దాన కిషోర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు. రోగులకు అన్ని రకాల సౌకర్యాలతో కూడిన వైద్యం అందించేందుకు అవసరమైన నిర్మాణాలను చేపట్టాలని సూచించారు.


Tags:    

Similar News