Telangana : నేడు మరోసారి ఢిల్లీకి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు;

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు హైదరాబాద్ లో జరిగే మహిళ దినోత్సవంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారరు. ఈరోజు ఇందిరా శక్తి మహిళా శక్తి బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. తొలిదశలో తెలంగాణ వ్యాప్తంగా 150 అద్దెబస్సులను మహిళలకు కేటాయిస్తున్నారు.
రాత్రికి పార్టీ పెద్దలతో...
అనంతరం రాత్రికి ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళతారు. ఈరోజు రాత్రికి ఢిల్లీలో పార్టీ పెద్దలతో సమావేశమవుతారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఈ నెల 10వ తేదీన నామినేషన్లకు ఆఖరి రోజు కావడంతో ఈరోజు రాత్రికి ఢిల్లీలో నలుగురు అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు.