Revanth Reddy : నేడు రంగారెడ్డి జిల్లాలో రేవంత్ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంబించనున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్జాన్‌పేటలో ఆయన పర్యటన ుంటుంది. స్కిల్ డెవలెప్‌మెంట్ యూనివర్సిటీ, అడ్వాన్ప్ టెక్నికల్ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యునిటీ హాలు భవనాల నిర్మాణాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
బహిరంగ సభలో...
అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు జరిగే బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు బహిరంగ సభకు పెద్దయెత్తున జనసమీకరణ చేయనున్నారు.