Revanth Reddy : దావోస్ లో రేవంత్ దూకుడు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కొనసాగుతుంది. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పర్యటన సాగుతుంది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కొనసాగుతుంది. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పర్యటన సాగుతుంది. అనేక మంది పారిశ్రామికవేత్తలను కలుసుకుని వారిని పెట్టుబడులు తెలంగాణలో పెట్టాలని రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బ్రెండీ బోర్గ్, ఇథియోపియా ఉప ప్రధాని మేకొనెన్ తో పాటు పలువరు పారిశ్రామికవేత్తలతో రేవంత్ రెడ్డి సమావేశమై పెట్టుబడులపై చర్చించారు.
వరస సమావేశాలతో...
అయితే రేపు హెల్త్ సెక్టార్ లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనే అంశంపై జరగనున్న చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారు. అనేక మంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. నోవర్తీస్, మెడ్ ట్రానిక్స్, ఆస్ట్రాజనిక్, గూగుల్, యుబర్, మాస్టర్ కార్డ్, యూపీఎల్ వంటి ఇంటర్నేషనల్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ సమావేశం కానున్నారు.