గల్లీ నుంచి ఢిల్లి వరకూ కేసీఆర్ బర్త్ డే వేడుకలు !

వారణాసికి చెందిన మృత్యుంజయ మిశ్రా అనే యువకుడు తెలంగాణ ఉద్యమ సమయంలో.. హైదరాబాద్ లో చదువుకుని వారణాసిలో

Update: 2022-02-17 06:22 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గల్లీ నుంచి ఢిల్లి వరకూ కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. బీజేపీ ఇలాకా అయిన గుజరాత్ లో, ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న వారణాసి నియోజకవర్గంలో, ఢిల్లీలో కేసీఆర్ కటౌట్లు, ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. దేశ్ కీ నేతా కేసీఆర్ అంటూ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో జరుగుతోన్న ప్రచారాలు అక్కడి ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

వారణాసికి చెందిన మృత్యుంజయ మిశ్రా అనే యువకుడు తెలంగాణ ఉద్యమ సమయంలో.. హైదరాబాద్ లో చదువుకుని వారణాసిలో స్థిరపడ్డాడు. అప్పట్నుంచి కేసీఆర్ పై ఉన్న అభిమానాన్ని.. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా బయటపెట్టాడు. ఇటీవల కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శించిన సందర్భం కూడా ఇందుకు తోడైంది. ఇక ఢిల్లీలో.. ఏకంగా 70 నియోజకవర్గాల్లో కేసీఆర్ బర్త్ డే సంబరాల హడావిడి కనిపిస్తోంది. మరోవైపు ఒడిశాలో కేసీఆర్ సైకత శిల్పం చూపరులను ఆకట్టుకుంటోంది. సిద్ధిపేట్ నుంచి వెళ్లి అక్కడ స్థిరపడిన ఓ యువకుడు సముద్ర తీరంలో ఈ సైకత శిల్పాన్ని రూపొందించాడు. ఇలా దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.


Tags:    

Similar News