సీనియర్ నేతలకు హస్తిన నుంచి పిలుపు
తెలంగాణ కాంగ్రెస్ నేతకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఎల్లుండి ఢిల్లీకి రావాలని ఆహ్వానించింది.
తెలంగాణ కాంగ్రెస్ నేతకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఎల్లుండి ఢిల్లీకి రావాలని ఆహ్వానించింది. మునుగోడు అభ్యర్థి, ఉప ఎన్నికలపై హైకమాండ్ చర్చించనుంది. తెలంగాణకు చెందిన ఎనిమిది మంది కాంగ్రెస్ నేతలకు పిలుపు వచ్చింది. నేరుగా ఫోన్ చేసి ఢిల్లీకి రావాలని పిలిచింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి వంటి సీనియర్ నేతలు అసహనం ప్రకటిస్తుండటంతో ఈ సమావేశానికి పార్టీపరంగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎనిమిది మంది...
కేవలం ఎనిమిది మంది సీనియర్ నేతలను మాత్రమే ఢిల్లీకి రావాలని పిలుపు వచ్చింది. పీీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క వంటి నేతలను ఆహ్వానించారు. వీరందరితో హైకమాండ్ చర్చింనుంది. ఏఐసీసీ ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికలపైనే ఈ సమావేశంలో చర్చించనున్నారని సమాచారం.