కేటీఆర్ పై టి-కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రం : #EscapistKTR
మంత్రి కేటీఆర్ నిన్న తెలంగాణ ప్రజలతో #AskKTR పేరుతో లైవ్ చాట్ నిర్వహించిన విషయం తెలిసిందే. వాటిలో చాలా ప్రశ్నలకు..
హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ విమర్శలు చేసింది. మంత్రి కేటీఆర్ నిన్న తెలంగాణ ప్రజలతో #AskKTR పేరుతో లైవ్ చాట్ నిర్వహించిన విషయం తెలిసిందే. వాటిలో చాలా ప్రశ్నలకు బదులిచ్చిన కేటీఆర్.. ప్రభుత్వ పాలనపై అడిగిన ఒక్క ప్రశ్నకూ సమాధానం ఇవ్వకపోవడాన్ని తప్పుపడుతూ తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. "కేటీఆర్ చేసిన #AskKTR లో ప్రజలు మీ ప్రభుత్వ పాలనపై అడిగిన ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం చెప్పకుండా పారిపోయాడు. #AskKTR అని కాకుండా #EscapistKTR అని పెట్టుకుంటే బాగుండేది." అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది.
కాగా.. నిన్న కేటీఆర్ నిర్వహించిన #AskKTR లైవ్ చాట్ లో కాంగ్రెస్ నేత కొండా సురేఖ పలు ప్రశ్నలు అడిగారు. కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాను ఎందుకు బ్లాక్ చేశారు ? యాదాద్రి నిర్మాణంలో లోపం తప్పిందం ఎవరిది? ఇలా చాలా ప్రశ్నలు అడగ్గా.. కేటీఆర్ ఏ ఒక్క ప్రశ్నకూ బదులివ్వలేదు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు, తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందా ? అన్న ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలపై సెటైర్లు వేశారు.