టెన్త్ పరీక్షల్లో కొత్త నిర్ణయం
పదో తరతగతి పరీక్షల్లో విద్యార్థులకు ఆఖరి పదిహేను నిమిషాల్లోనే బిట్ పేపర్ ఇవ్వాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది
ఈ ఏడాది పదో తరతగతి పరీక్షల్లో విద్యార్థులకు ఆఖరి పదిహేను నిమిషాల్లోనే బిట్ పేపర్ ఇవ్వాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. చివరి పదిహేను నిమిషాల్లో బిట్ పేపర్ కు పది జవాబులు రాయాల్సి ఉంటుంది. ఇక జనరల్ సైన్స్ పరీక్షలో రెండు పేపర్లను ఒకేసారి కాకుండా విడివిడిగా ఇవ్వాలని నిర్ణయించింది.
వచ్చే నెల మూడు నుంచి...
ఈ ఏడాది నుంచి కొత్తగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. నలభై మార్కుల చొప్పున ఉండే ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలకు తొంభై నిమిషాల చొప్పున సమయం ఇవ్వనున్నారు. వచ్చే నెల మూడో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.