Telangana Campaign : ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ... లాస్ట్ బాల్ కోసం?

ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం సమాప్తమవుతుంది.

Update: 2023-11-28 03:15 GMT

ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం సమాప్తమవుతుంది. ఇక పోలింగ్ కు అందరూ సిద్ధమవ్వాల్సిందే. ప్రచారం చివరిరోజు కావడంతో అన్ని పార్టీల అగ్రనేతలు చిట్ట చివరిసారిగా తమ ఎన్నికల ప్రచారాన్ని నేడు నిర్వహించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతలందరూ ఈరోజు ప్రచారాన్ని నిర్వహించి తమ పార్టీల అభ్యర్థుల గెలుపునకు ప్రయత్నించనున్నారు. నేతలు చివరి బాల్ వేయనున్నారు.

మూడు పార్టీల నేతలు...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోజు వరంగల్, గజ్వేల్‌లో పర్యటించనున్నారు. ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. దాదాపు నెలరోజులకు పైగానే కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు. చివరి రోజున తాను పోటీ చేస్తున్న గజ్వేల్ లోనూ పర్యటిస్తున్నారు. బీజేపీ తరుపున మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే దేవరకొండ, పాలకుర్తి సభల్లో పాల్గొంటారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలు ప్రచారం చివరిరోజున ప్రచారాన్ని నిర్శహించనున్నారు. రాహుల్ హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్, నాంపల్లి, మల్కాజ్ గిరిలో కార్నర్ మీటింగ్, రోడ్ షో లలో పాల్గొంటారు. ప్రియాంక గాంధీ జహీరాబాద్ లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈ సభల కోసం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News