KCR : యశోదా ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
యశోదా ఆసుపత్రి నుంచి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు.
యశోదా ఆసుపత్రి నుంచి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. కొద్దిసేపటి క్రితం ఆయనను వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ నెల 8వ తేదీన కేసీఆర్ యశోదా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఫాం హౌస్ లో కాలు జారిపడటంతో ఆయన తుంటి ఎముక ఫ్రాక్చర్ అయిందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రి నుంచి నేరుగా నందినగర్ లోని ఆయన తన నివాసానికి బయలుదేరి వెళ్లారు.
పరామర్శలతో...
అయితే తుంటికి ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులు కొద్ది రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. మొత్తం ఎనిమిది రోజుల పాటు కేసీఆర్ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఎనిమిది రోజులు ఆయనను చూసేందుకు రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీలు తరలి వచ్చారు. యశోదా ఆసుపత్రికి అభిమానులు ఎవరూ రావద్దని, మిగిలిన రోగులకు ఇబ్బంది కలిగించవద్దని కేసీఆర్ కోరే పరిస్థితి వచ్చింది. ఆయన పూర్తిగా కోలుకోవడంతో కొద్దిసేపటి క్రితం డిశ్చార్జ్ అయ్యారు.